Saturday, April 27, 2024

ప్ర‌భుత్వ పాఠ‌శాలలో విద్యావాలంటీర్ల కోర‌త‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): కరోనా కష్టకాలంలో ప్రైవేటు బడుల్లో స్కూల్‌ ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించా రు. ఒక్కో జిల్లాలో ఈ విద్యాసంవత్సరంలో 2 వేల నుంచి 5వేల వరకు విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 2.5 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడిబాట పట్టారు. ప్రభుత్వ విద్యపై గతంలో ఉన్న అపోహలను తొలగించి..విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ విద్యపై మరింత నమ్మకం కల్గించాల్సిన ఉన్నతాధికారులే అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న వారు ఉంటారో.. పోతారో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులు భరించలేకనే చాలా మంది వస్తున్నారని.. మళ్లి తిరిగి వెళ్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల లెక్కలు తీస్తున్నామని అంటున్నారు. ఇలా వచ్చినవారు సర్కారు స్కూళ్లలో ఎంత మంది ఉంటారో.. ఎంతమంది పోతారో పూర్తి లెక్కతేలాకే విద్యా వాలంటీర్ల నియామకం, టీచర్ల కేటాయింపులు చేపడుతామని అధికారులు అంటున్నారు.

అంటే అప్పటి దాకా టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో టీచర్ల నియామకం ఇకుండదనే స్పష్టమవుతోంది. కరోనా దెబ్బతో ప్రైవేట్‌ బడులు మూ తబడుతుంటే జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ఉండి మూతపడ్డ సర్కారు స్కూళ్లు గత నెలలో సుమారు 240 వరకు తెరుచుకున్నాయి. ప్రైవేట్‌ నుంచి వస్తున్న విద్యార్థుల కారణంగానే ఈ మూతపడ్డ స్కూళ్లను తెరిచినట్లు అధికారులు చెప్తున్నారు. అక్కడక్కడే కొన్ని స్కూళ్లలో టీచర్లను సర్దుబాటు చేసినా ఇంకా చాలా స్కూళ్లలో టీచర్ల కొరత వెంటాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement