Saturday, May 4, 2024

Raining | ఆలస్యంగా కరుణించిన వరణుడు.. అతీ భారీ వర్షాలతో రెడ్‌ అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆలస్యంగానైనా తెలంగాణపై వరుణుడు కరుణించాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా జల్లులు కురిశాయి. అక్కడక్కడా మోస్తారు జల్లులు కురిశాయి. ఈ వానాకాలంలో తొలిసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకేసారి రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ లు జారీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో రానున్న 5 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

రాష్ట్రంలో వాతావరణశాఖ అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాలు సహా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆ అయిదు జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ను జారీ చేశారు.

- Advertisement -

అదేవిధంగా బుధవారం కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయింది. మరోవైపు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement