Thursday, May 2, 2024

కేసీఆర్ రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్- ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

తెలంగాణ సీఎం కేసీఆర్ రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ అని పొగుడుతూ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను పెట్టారు. తెలుగులో పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు సాధించిన సినిమాల‌తో పాటు అందులో లీడ్ రోల్‌లో క‌నిపించిన టాలీవుడ్ హీరోల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ వ‌ర్మ ట్వీట్ పోస్ట్ సాగ‌డం గ‌మ‌నార్హం. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, పుష్ప‌, కేజీఎఫ్ 2 అడుగు జాడ‌ల్లో ప‌య‌నిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి బీఆర్ఎస్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని వ‌ర్మ తెలిపారు. రీల్ ఫిల్మ్ స్టార్‌లు అయిన య‌శ్‌, ప్ర‌భాస్ రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్‌గా కేసీఆర్ నిల‌వ‌నున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement