Sunday, April 28, 2024

TS : రాష్ట్రంలో ఆర్డీవో బ‌దిలీలు…

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత బ‌దిలీల‌పై ఫోక‌స్ పెట్టింది. గ‌తంలో ఉన్న అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పిస్తూ బ‌దిలీల‌ను చేస్తోంది. మొద‌టి పోలీస్ శాఖ‌లో బ‌దిలీల‌ను, అనంత‌రం క‌లెక్ట‌ర్‌ల బ‌దిలీలు నిర్వ‌హించింది. తాజాగా ఆర్డీవోల‌ను ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున బ‌దిలీలు చేప‌ట్టింది. అందులో భాగంగా మొత్తం 18 మంది బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది.

- Advertisement -

సంబంధిత జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వెంటనే బదిలీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరింది. బదిలీ అయిన ఆర్డీవోల జాబితాలో పి. బెన్షాలోమ్‌, యాదాద్రి భువనగిరి అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ), వి.భుజంగ రావు నిర్మల్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, జి.శ్రీనివాసరావు, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్‌, బి.స్రవంతి, ఆర్మూర్‌ ఆర్డీవో, టి.వినోద్‌ కుమార్‌,ఆదిలాబాద్‌ ఆర్డీవో, సిధమ్‌ దత్తు, వరంగల్‌ ఆర్డీవో, జీ.అంబదాస్‌ రాజేశ్వర్‌, బోధన్‌ ఆర్డీవో, బి.రాజా గౌడ్‌, ఉమెన్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లా సంక్షేమాధికారి, బి.చెన్నయ్య, జగిత్యాల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, సొక్కుల రమేశ్‌ బాబు, హుజూరాబాద్‌ ఆర్డీవో, వి.రామ్మూర్తి, హుస్నాబాద్‌ ఆర్డీవో, పి.సదానందం, సిద్దిపేట ఆర్డీవో, రమేశ్‌ రాథోడ్‌, బాన్సువాడ ఆర్డీవో, కె.శంకర్‌ కుమార్‌, హనుమకొండ స్పెషల్‌ కలెక్టర్‌ పీఏ, ఏ విజయ కుమారి, ఏటూరునాగారం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, బి.శకుంతల, సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌, బి.గంగయ్య, పెద్దపల్లి ఆర్డీవో, సీహెచ్‌ మధుమోహన్‌, వికారాబాద్‌ ఆర్డీవో తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement