Saturday, April 27, 2024

RR: పార్క్ చేసి ఉన్న ఆటో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

షాద్ నగర్, అక్టోబర్ 18, (ప్రభ న్యూస్) : షాద్ నగర్ పట్టణంలో దూసకల్ రోడ్డులోని కేకేఆర్ కన్వెన్షన్ ముందు నిలిపి ఉన్న గణేష్ అనే యువకుడికి చెందిన టీఎస్ 06 యూబి 1324 నెంబర్ గల ఆటోను రాత్రి గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు.

ఆటోను తీసుకెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయ్యింది. ఈ మధ్యనే పైసా పైసా కూడబెట్టిన యువకుడు గణేష్ ఆటో కొన్నాడు. ఆటో చోరీకి గురవడంతో గణేష్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement