Friday, May 17, 2024

ఢిల్లీకి తరలిన గులాబి దండు.. రంగారెడ్డి జిల్లా నుండి భారీగా తరలిన నేతలు

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి): యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న ధర్నాకు టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుండే శంషాబాద్ విమానాశ్రయం లో సందడి నెలకొంది. విడతల వారీగా నేతలంతా తరలి వెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తో తాడో పేడో తేల్చుకునే పనిలో పడింది అధికార తెరాస. ఇప్పటికే పలు విడతల్లో ఆందోళనలు చేపట్టారు. ఐనా కేంద్రం నుండి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో ఢిల్లీ లోనే తేల్చుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం కేసీఅర్ ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు అక్కడే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, డీ సీ సీ బీ చైర్మన్లు, డీ సీ ఎం ఎస్ చైర్మన్ల తోపాటు ఇతర నేతలు తరలి వెళ్లారు.

ఉమ్మడి జిల్లా నుండి భారీగా…

ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి భారీగా తరలి వెళ్తున్నారు. విడతల వారీగా నియోజకవర్గాల నుండి బయలు దేరారు. ఆదివారం సాయంత్రం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి…రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలు దేరి వెళ్లారు. రాత్రికి మరికొంత మంది నేతలు బయలు దేరి వెళ్లనున్నారు. తక్కువ మంది మాత్రం సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ వెళ్లనున్నారు. జిల్లా స్థాయి నేతలు ..ఎంపీపీ…జడ్పీటీసీ లు కూడా వెళ్తున్నారు. మొత్తం మీద ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మార్కు ఉండేలా భారీగా తరలి వెళ్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement