Friday, April 26, 2024

ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు.. సిఐ టంగుటూరి శ్రీను

వికారాబాద్, (ప్రభ న్యూస్): ఐపీఎల్ 2023 ఫైనల్ పోటీ చెన్నై-గుజరాత్ల మధ్య ఆదివారం సాయంత్రం జరగనున్న సమయంలో యువత బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వికారాబాద్ టౌన్ సిఐ టంగుటూరి శ్రీను తెలిపారు. ఆదివారం ఆయన ప్రభ న్యూస్ తో మాట్లాడుతూ ఐపీఎల్ 2023 ఫైనల్ ఆదివారం రాత్రి నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని గతంలో బెట్టింగ్లకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై ఓ నీఘా ఉంచినట్టు ఆయన తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి ఉండాలి తప్ప బెట్టింగ్ లకి పాల్పడవద్దని ఆయన సూచించారు. తల్లిదండ్రులు సైతం తన పిల్లలు ఏం చేస్తున్నారని విషయాన్ని తరచూ గమనిస్తూ ఉండాలని లేనిపక్షంలో యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ నడుస్తున్న సమయంలో తప్పనిసరిగా తనిఖీలు ఉంటాయని ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement