Sunday, April 28, 2024

TS : వికారాబాద్​లో ఈదురుగాలులు….నేల‌కొరిగిన‌చెట్లు

వికారాబాద్, ఏప్రిల్ 19 (ప్రభ న్యూస్): వికారాబాద్ నియోజకవర్గంలో అర్థ‌రాత్రి నుంచి ఈదురుగాలులు భీభ‌త్సం సృష్టించాయి. ఈదురుగాలుల దెబ్బ‌కు చెట్లు నేల‌కొర‌గ‌డంతో పాటు విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. దాదాపు మూడు గంట‌ల పాటు ఈదురుగాలుల‌తో పాటువ‌ర్షం కురిసింది.

వికారాబాద్ మండలం మొహం పేట్ తదితర మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగి చెట్లు నేలకొరిగాయి ఈ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈదురుగాలులు త‌గ్గ‌క అధికారులు విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement