Friday, December 6, 2024

థియేటర్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలి.. సీపీ స్టీఫెన్ రవీంద్ర

సినిమా థియేటర్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలోని పలు సినిమా థియేటర్ల యజమానులకు పోలీసులు నోటీసులు అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల థియేటర్ యజమానులతో సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తప్పనిసరిగా థియేటర్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రద్దీగా ఉండే రోడ్లపై ఉన్న థియేటర్లు టైమ్ షెడ్యూల్ పాటించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. థియేటర్ల ఎదుట ట్రాఫిక్ జామ్ అవకుండా చూసుకోవాలని, వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement