Saturday, May 18, 2024

గంగారంలో పోలీసుల కార్డాన్ సెర్చ్.. ద్విచక్ర వాహనాలు ఆటో స్వాధీనం

వికారాబాద్, (ప్రభ న్యూస్) : జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదర్శ సరం వికారాబాద్ డిఎస్పి కె నర్సింలు ఆధ్వర్యంలో వికారాబాద్ టౌన్ సిఐ టంగుటూరి శ్రీను మోహన్ పెట్స్ సిఐలు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారంలో బుధవారం సాయంత్రం కార్డాన్ సర్చ్ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 36 ద్విచక్ర వానాలను ఒక ఆటను స్వాధీనం చేసుకున్నరు.

ఈ సందర్భంగా డిఎస్పి నర్సింగ్ మాట్లాడుతూ ప్రజలు సరైన దృవపత్రాలు ఉంచుకొని వాహనాలు నడపాలని హెల్మెట్ ధరించడంతోపాటు లైసెన్సు కలిగి ఉండాలని ఆయన సూచించారు టౌన్ సిఐ టంగుటూరి శ్రీను మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందని వాన దారులు తమ లైసెన్స్ ను హెల్మెట్ ను తమ వద్ద ఉంచుకోవాలని వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు ఉండాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement