Thursday, April 25, 2024

మంత్రి సబితారెడ్డికి బ‌ర్త్ డే విషెష్ తెలిపిన మంత్రి కేటీఆర్

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.. సామాన్య కార్యకర్తను మొదలుకొని మంత్రుల వరకు శుభాకాంక్షలు చెప్పారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సబితారెడ్డికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ములుగులో గల హార్టికల్చర్ యూనివర్సిటీలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటి సందర్భంగా మంత్రులంద‌రూ కలిసి మంత్రి సబితా రెడ్డికి పూల బోకే అందజేసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులందరికీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఉదయం శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పలు దేవాలయాల నుండి వచ్చిన అర్చకులు ఆశీర్వదించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు వేడుకలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement