Thursday, May 2, 2024

అందరి ఆత్మ బంధువు కేసీఆర్… మంత్రి స‌బితారెడ్డి

అంద‌రి ఆత్మ బంధువు కేసీఆర్ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సమాజంలో అందరూ సమానంగా ఎదగాలనే లక్ష్యంతో ఇప్పటికే అమలు చేస్తున్న దళిత బంధుకు తోడుగా గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గిరిజనులు మంత్రి సబితారెడ్డి నివాసానికి తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన బంజారా మహిళలు సాంప్రదాయ నృత్యం చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. వారందరితో ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి మాట్లాడారు.

అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అనే సామెతను మరిపిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు అడగకున్నా.. ఎన్నికల్లో వాగ్దానం చేయకున్నా.. జాతి గర్వించదగ్గ కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇప్పటికే కేంద్రంతో సహా అనేక రాష్టాలు అమలు చేస్తున్నాయని, దళిత బంధు, గిరిజన బంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు న్యాయం లభిస్తుందన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన మిషన్ భగీరథకు అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులతో పాటు, దేశంలో ఏ రాష్టానికి రానన్ని విద్యా రంగంలోని ఇన్స్ పేర్ అవార్డులు తెలంగాణకు రావటం ప్రజలందరికీ గర్వకారణంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గిరిజన బంధుతో బంజారాల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గుమ్మడవెళ్లి గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టాలని ప్రజలు కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement