Friday, April 26, 2024

కొన‌సాగుతున్న‌ అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద్ర‌యాత్ర ఇవాళ 19వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి పాదయాత్ర మొదలైంది. ఇవాళ తిమ్మాపురం మీదుగా ద్వారకాతిరుమల వరకు పాదయాత్ర కొనసాగనుంది. యాత్రలో పాల్గొంటున్న వైద్య విద్యార్థులు మాట్లాడుతూ అమరావతి అందరికి అందుబాటులో ఉండే రాజధాని అని, కొందరి కోసం కాదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ అమరావతికి అంగీకరించి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. మహిళా జేఏసీ నాయకురాలు శైలజా మాట్లాడుతూ పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ చేస్తున్న యత్నాలను తిప్పికొడుతామని పేర్నొ్న్నారు. మాజీ మంత్రి జవహర్‌ మాట్లాడుతూ రాజధాని అమరావతి ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement