Sunday, May 19, 2024

కొవిడ్‌ టీకాపై అపోహలొద్దు..

తాండూరు : కరోనా మహామ్మారిని తరిమేందుకు ప్రవేశ పెట్టిన కొవిడ్‌ టీకాపై ఎవ్వరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అందరూ ధైర్యంగా టీకా వేయించుకోవాలని కాంగ్రెస్‌ తాండూరు పట్టణ అధ్యక్షులు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. తాండూరు పట్టణంలోని పీపీ యూనిట్లో ఆయన కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమని, టీకా వేసుకోవడంలో ఎలాంటి అపోహలు పెట్టుకోరాదన్నారు. 45ఏండ్లు నిండిన వారితో పాటు వచ్చేనెల 1నుంచి 18ఏండ్లు నిండిన వారంతా టీకా వేసుకునేందుకు ముందుకురావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement