Thursday, May 2, 2024

కరోనా నిబంధనలు పాటించండి..

తాండూరు : ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని 33వ వార్డు కౌన్సిలర్‌ ప్రవీణ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. వార్డులో మున్సిపల్‌ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్‌ మందు పిచికారి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ ప్రవీణ్‌ గౌడ్‌ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా హైపోక్లోరైట్‌ ని పిచికారి చేయించామన్నారు. వార్డులోని ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. బహిరంగా ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించి.. శానిటైజర్‌ వినియోగించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement