Thursday, May 9, 2024

Breking: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతా వర్షం దంచి కొడుతోంది. అమీర్‌పేట‌, కూకట్ పల్లి, హైదర్ నగర్,కెపిహెచ్ బి కాలనీ,మాదాపూర్‌, మోతినగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, బొరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్, మదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, మెహదీపట్నం, మసబ్ ట్యాంక్, లక్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షం కుమ్మేస్తోంది.

వర్షం వల్ల రోడ్డలపై భారీగా నీరు నిలిచింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గంటలపై రోడ్డుపై ఉండాల్సి వస్తుంది. వర్షసూచన ఉండడంతో చాలా మంది మెట్రో లో ప్రయాణానికి మొగ్గు చూపారు. దీంతో మెట్రో రైళ్ల రద్దీ భారీగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement