Monday, April 29, 2024

BSP : ఇవాళ పెద్దపల్లిలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న బీఎస్పీ ర్యాలీ, బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మాయావతి సభకు చేరుకుంటారని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష వెల్లడించారు.

బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలితో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవనున్నట్లు పేర్కొన్నారు. మాయావతి రాక నేపద్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభకు హాజరైన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు సైతం ఏర్పాటు చేసినట్లు నేతలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement