Wednesday, May 15, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. మబ్బులతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మార్పులు చోటుచేసుకోవడంతో అక్కడక్కడా ఒక మోస్తారు వర్షం కురుస్తోంది. నగరంలోని అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్, కాలిమందిర్, సన్ సిటీ, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాన పడుతోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement