Sunday, April 28, 2024

TS : రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్…అన్నదమ్ములపై రాళ్ల దాడి

హైదరాబాద్ లో గంజాయి మూక రెచ్చిపోయిందిఅత్తాపూర్‌లోని హసన్ నగర్‌లో ఓ ఇంటి పై దాడికి పాల్పడి వీరంగం సృష్టించారు. రాళ్లతో, కర్రలతో గంజాయి గ్యాంగ్ దాడికి తెగబడ్డారు.

- Advertisement -

ఇంట్లో ఉన్న అన్నదమ్ములపై రాళ్ల దాడి గంజాయి బ్యాచ్ దాడి చేసింది. అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు గంజాయి సేవించవద్దన్న పాపానికి గ్యాంగ్ రెచ్చిపోయారు. ఒక్కసారిగా గంజాయి బ్యాచ్ దాడికి దిగింది. అత్తాపూర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హసన్ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న కేటుగాళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా రోడ్ల పైనే రౌడీ గ్యాంగ్ గంజాయి సేవిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement