Wednesday, May 1, 2024

తెలంగాణ బిజెపిలో ముసలం – స్వ‌రం పెంచిన ర‌ఘ‌నంద‌న్ … బండిపై ఆరోప‌ణ‌లు..ఆ కీల‌క ప‌ద‌వి కోసం డిమాండ్

ఢిల్లీ – తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి.. బండి సంజ‌య్ టార్గెట్ గా ఒక వ‌ర్గం…. అత‌నికి మ‌ద్ద‌తుగా మ‌రో వ‌ర్గం బాహటంగా గొడ‌ప‌డుతున్నారు.. ఈ వివాదాల న‌డుమ బండి సంజ‌య్ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌నున్నార‌ని వార్త‌లు గ‌త వారం రోజులుగా హాల్ చ‌ల్ చేస్తున్నాయి.. ఈ క్ర‌మంలోనే బిజెపి ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు గ‌ళం విప్పారు.. బండి సంజ‌య్ పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ నిజ‌మేనంటూ బాంబు పేల్చారు. అంతే కాకుండా అధ్య‌క్షుడ‌య్యే యోగ్య‌త త‌న‌కూ ఉందంటూ చెప్పుకున్నారు..ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు .

‘నేను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వండి. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు, రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తా. నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రూ. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు . కేసీఆర్ ను కొట్టే మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారు. అంతేకాని బీజేపీని చూసి కాదు . నాకంటే ముందు బీజేపీ పోటీచేస్తే వచ్చింది 3,500 ఓట్లు . పదేళ్ళలో పార్టీకోసం నాకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదు. నేను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రఘునందన్ రావుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా రఘునందన్ రావుకు జితేందర్ రెడ్డి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు. బీజేపీ శాసనసభపక్ష నేతగా ఉన్న రాజాసింగ్ పై ఆ పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఇంకా ఎత్తివేయలేదు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్ష పదవిపై రఘునందన్ రావు ఆసక్తిని చూపుతున్నారు. ఆ ప‌ద‌వి అయినా ఇప్పించాల‌ని ర‌ఘ‌నంద‌న్ అధిష్టానంపై వ‌త్తిడి తెస్తున్నారు.. ఇంటిలో పుస్తెలు తాడు అమ్మి ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన బండి సంజ‌య్ కు ప్ర‌క‌ట‌న‌ల కోసం వంద కోట్లు ఎలా ఖ‌ర్చు చేశారంటూ నిల‌దీశారు.. ఆ వంద కోట్లు త‌న‌కు పార్టీ ఇచ్చి ఉంటే బిజెపిని ఎదురులేని శ‌క్తి గా తీర్చిదిద్దేవాడిన‌ని ముక్తాయింపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement