Monday, May 27, 2024

కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ గా నల్ల రఘుమారెడ్డి ప్రమాణ స్వీకారం

కర్మన్ ఘాట్ సెప్టెంబర్ 5 (ప్రభ న్యూస్) కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం పాలక మండలి చైర్మన్గా నల్ల రఘుమారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్ ,రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి శేఖర్ దేవాలయ చైర్మన్ గా ఎన్నికైన నల్ల రఘుమారెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలు భక్తుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ కాలనీ సంక్షేమ సంఘాల అభిమానులు ధర్మకర్తలు నల్ల రఘుమారెడ్డి దంపతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గోగిరెడ్డి అంజిరెడ్డి, చాతిరి మధుసాగర్, బిల్లా కంటి కిరణ్ కుమార్ ,బబ్బురి ఆనంద్ గౌడ్, చీర తిరుమలేష్ ,సంబరాజు శైలజ, జయశంకర్ శుక్ల, గూడూరు మధుసూదన్ రెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, మేక సురేందర్ రెడ్డి, చేగోని సురేష్ గౌడ్, బిస్కుంట్ల సతీష్ గౌడ్, మేకల యాదగిరి, ముద్దా కళ్యాణ్ చక్రవర్తి గడ్డి అన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, డివిజన్ భరోసా అధ్యక్షులు రాజకుమార్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రోజా రెడ్డి, ఊరుకొండ రమాదేవి ,గోకుల్ సరోజ, రజిని రెడ్డి , లక్ష్మి, అనసూయ ,గోపాల్ ముదిరాజ్, చందు యాదవ్ ,టవర్ శీను, జగదీష్ గౌడ్ ,శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement