Monday, April 29, 2024

Protest – బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

కడం ఫిబ్రవరి 6 (ప్రభా న్యూస్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యాల‌ను ఖండిస్తూ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కడెం లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, బి.ఆర్.ఎస్ నాయకులు ఓటమి ని తట్టుకోలేక ఇలాంటి అసభ్యకరమైన మాటలకి పాలపడుతున్నారని, రేవంత్ రెడ్డి పై చేసిన వాఖ్యలకి బాల్క సుమన్ వెంటనే క్షమాపణలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో కడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బరుపటి రమేష్ వర్మ ఎస్.సి సెల్ జిల్లా అధ్యక్షులు తరి శంకర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు షేక్ రఫిక్ బబ్లు కట్ల సాగర్ జడ ఇందూర్ యమ్.ఏ రహీమ్ పడిగెల రాజు రెంకల రాజన్న కుమార్ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement