Tuesday, April 30, 2024

Chennur – సిఎం దిష్టిబొమ్మ ద‌గ్ధానికి య‌త్నం – బిఆర్ఎస్ నాయకుల అరెస్టు

చెన్నూర్ ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన బిఅర్ఎస్ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరశిస్తూ ఈ రోజు ఉదయం బిఅర్ఎస్ నాయకులు కొత్త బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లివిగ్రహ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేసే ప్రయత్నంలో పోలీసుకు నాయకులకు మధ్య కాస్త తోపులాట జరిగింది ఈ క్రమంలో కౌన్సిలర్ రేవెళ్ళి మహేష్, శ్రీనులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement