Friday, May 3, 2024

Demand – బీసీ కుల గణన త‌ర్వాతే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు – ఎమ్మెల్సీ క‌విత

వడ్డేపల్లి.( హన్మకొండ ) బీసీ కుల గణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శాసనశాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హనుమకొండ లొ పూలే యునైటెడ్ ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా బీసీ హక్కుల సాధనకై మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడింద‌ని, 2012 మే నెలలో హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయాలని కొట్లాడుంది భారత జాగృతి అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 42 శాతం ఉన్న బీసీలు ఉంటారని, ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల లోపే బీసీ జనగణ చేపడతామని చెప్పినట్లు గుర్తు చేశారు .ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా కాంగ్రెస్ బీసీ జన గణపై కాంక్రీట్ స్టెప్ కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణను చేపడితే 24వేల‌ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అందుతుందని చెప్పారు.

2024 25 సంవత్సరానికి త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధికి రూ 20కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్రత కల్పించి ఎంబీసీ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని సూచించారు. యుపిఎస్సి ఎగ్జామ్స్ లో బహుజన వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమ తరహలో బోనాలు ఎత్తుకొని అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పూలే యునైటెడ్ ఫ్రంట్ ఫోరం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, జలవనుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్,భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్ , నాయకులు రాజారాం యాదవ్, బక్క నాగరాజు యాదవ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement