Monday, May 20, 2024

Protest – ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడమేమిటి?

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)22: పార్ల మెంటులో చేసిన దాడిని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే వారి గొంతుకు నొక్కడానికి,బిజెపి ప్రభుత్వం అహంకారంతో వారిని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.ప్రతి పక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వారిని సస్పెండ్ చేయడం అనేది మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు.పార్లమెంటులో బిజెపి ప్రభు త్వం అహంకారపూరితంగా, అకారణంగా ప్రతిపక్ష ఎంపీ లను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఏఐసిసి, పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిం చారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్బీన్ హందన్,మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి,భక్తవత్సలం,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,జిల్లా nsui అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్,మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ,ఉష, విజయలక్ష్మి, మఠం రేవతి,రం బూపల్,సంతోష్,కార్పొరేటర్ రోహిత్,వివిధ మండల అద్యక్షులు,అనుబంధ విభాగాల అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement