Tuesday, April 30, 2024

NZB: మోడీ అసమర్థ పాలనకు నిదర్శనం.. ఎంపీల స‌స్పెండ్.. మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 22 (ప్రభ న్యూస్) : పార్లమెంటులో చేసిన దాడిని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే.. వారిని స‌స్పెండ్ చేయ‌డమే మోడీ అస‌మ‌ర్థ పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని… దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి పక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వారిని సస్పెండ్ చేయడం అనేది మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనమ‌న్నారు. పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం అహంకార పూరితంగా, అకారణంగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్బీన్ హందన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… పార్లమెంటులో దాడిపై చర్చ జరిగితే బీజేపీ పాలన లోపం ప్రజలకు తెలుస్తుందనే భయంతో ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేశారని మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కు పట్టిన గతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి పడుతుందని, వెంటనే సస్పెండ్ చేసిన ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసి క్షమాపణలు చెప్పాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ… పార్లమెంటులో జరిగిన దాడికి బాధ్యులు ఎవరని అడిగినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, దీనిని ప్రజాస్వామ్య వాదులు యువకులు గమనిస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈరోజు దేశవ్యాప్త ధర్నాలు జరుగుతున్నాయన్నారు.

కేశ వేణు మాట్లాడుతూ… రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురా వాలని, అందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, భక్తవత్సలం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, ఉష, విజయలక్ష్మి, మఠం రేవతి, రాంభూపాల్, సంతోష్, కార్పొరేటర్ రోహిత్, వివిధ మండల అద్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement