Sunday, May 5, 2024

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ సోమవారం ఉదయం కిడ్నీ సంబంధిత కారణాలతో కన్నుమూశారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద అనేక సూపర్ హిట్ సినిమాలను వెంకట్ నిర్మించారు. సామాన్యుడు, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్ మాన్, డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించారు. అలాగే ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో డైవర్స్ ఇన్విటేషన్ అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. వెంక‌ట్ హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement