Sunday, May 5, 2024

Pro kabaddi League: ప్రొక‌బ‌డ్డీ సీజ‌న్ -8కు కౌంట్ డౌన్ ప్రారంభం

గత ఏడు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చింది. ఈనెలలోనే ఎనిమిదో సీజన్ 15రోజుల్లో మొదలుకానున్నది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బెంగళూరు వేదికగా జర‌గ‌నుంది. కబడ్డీ అభిమానులు ఎప్పుడెడప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐపీఎల్ మాదిరే అభిమానులను విశేషంగా అలరించే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కు సంబంధించిన తొలి దశ సీజన్ వచ్చేసింది. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచులన్నింటినీ ఒకే వేదికలో ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నారు.

డిసెంబర్ 22 నుంచి మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ లో ఒక్కోరోజు మూడు మ్యాచులు కూడా జరుగుతుండటం గమనార్హం. ఈనెల 22 నుంచి బెంగళూరులోని షెరటన్ గ్రాండ్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు. 22 న.. బెంగళూరు బుల్స్ వర్సెస్ యూ ముంబా మధ్య తొలి మ్యాచ్ తో ఈ సీజన్ మొదలుకాబోతున్నది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 దాకా జరిగే ఫస్ట్ ఫేజ్ లో ఒక్కో జట్టు ఇతర జట్లతో రెండు మ్యాచులు ఆడనున్నాయి. మొత్తం 12 జట్లు పోటీ పడబోతున్నాయి. అయితే ఈ పోటీల‌కు తెలుగు టైటాన్స్ జ‌ట్టు భారీగా క‌స‌ర‌త్తు చేస్తోంది. తెలుగు టైటాన్స్ క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియో కూ యాప్ లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement