Monday, December 11, 2023

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటు వేయండి – ప్రియాంకా గాంధీ పిలుపు

ఖానాపూర్:తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీకి ఓ విజన్ ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ చెప్పారు. ఆదివారంనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు..

ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏళ్లు దాటినా ఆమెను ఇంకా ఈ ప్రాంత ప్రజలు ఆరాధిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని ఆమె గుర్తు చేశారు. గిరిజనులు, ఆదీవాసీల కోసం ఇందిరాగాంధీ అనేక కార్యక్రమాలు ప్రారంభించారన్నారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని ప్రియాంకగాంధీ చెప్పారు. సిద్దాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్ అని ప్రియాంకగాంధీ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

- Advertisement -
   

తమ మానిఫెస్టో లో ఇచ్చిన అరు వాగ్దానాలు అధికారం లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement