Saturday, April 27, 2024

TS: ప్రాజెక్ట్ ల‌పై చ‌ర్చ‌కు సిద్ధం… హ‌రీష్ ను డేట్, స‌మ‌యం చెప్ప‌మ‌న్న జూప‌ల్లి…

కాలువ‌లు త‌వ్వ‌కుండానే పాల‌మూరు ప‌నులు
ఇది కేసీఆర్ ఘ‌న కార్యం
ఇప్ప‌టికి దోచుకున్న‌ది స‌రిపోకే…
స‌చివాల‌యం ముట్ట‌డి అంటూ బిఆర్ఎస్ పిలుపులు
కేసీఆర్ పాల‌న‌లోనే 6వేల మంది రైతుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు
విచారణ‌లో అంద‌రి బాగోతాలు బ‌య‌ట‌కు తీస్తామ‌న్న మంత్రి

పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు త‌వ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారని, దీనిపై ఎక్కడికి వస్తావో చెప్పు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి హ‌రీష్ రావుకు సవాల్ విసిరారు. పాల‌మూరులో ఆయ‌న ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ…. బీఆర్ఎస్ నేతలు పదేళ్ళలో ప్రజాధనం దోచుకుతిన్నారని మండిపడ్డారు. మళ్ళీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని ఆరోపించారు.

తెలంగాణాలో ప్ర‌స్తుత నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని జూప‌ల్లి తేల్చి చెప్పారు… నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు ? అని హ‌రీష్ రావును ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోక్ స‌భ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చారా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలనలో 6వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. వచ్చే వానాకాలం నుంచి అన్ని పంటలకు ప్రభుత్వమే భీమా సౌకర్యం కల్పింస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ళ పండగ‌ని, ప్రాజెక్ట్ ల విచార‌ణ‌లో అందరి బాగోతాలు బయటపడుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement