Friday, December 6, 2024

RR :వికారాబాద్ లో ప్రసాద్ విజయం ఖాయం..కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మేనక

వికారాబాద్,నవంబర్ 11(ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ద్వారా సామాన్య ప్రజల కష్టసుఖాలు తోలుగుతాయని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మేనక పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నపల్లిలో ప్రచార నిర్వహించిన తరంగా ఆమె మాట్లాడుతూ మాజీమంత్రి ప్రసాద్ కుమార్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రజల్లో మంచి స్పందన ఉందని తెలిపారు.

అధికార బీబ‌ఆర్ఎస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ ఎవరికి కూడా ఏం మాత్రం ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు. మాజీమంత్రి ప్రసాద్ కుమార్ చేసిన అభివృద్ధే నేటికీ కనిపిస్తున్నాయని ఆయన మరోసారి గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని తెలిపారు. బీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని వికారాబాద్‌లో ప్రసాద్ కుమార్ విజయాన్ని ఎవరు ఆపజాలరని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరవేస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement