Thursday, May 2, 2024

పేద‌విద్యార్థికి ఆర్థిక‌సాయం..సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఔదార్యం..

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆశతో కాకుండా,ఆశయంతో ముందుకు సాగాలని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ తెలిపారు. ఓ నిరుపేద విద్యార్థిని పై చదువు నిమిత్తం ఆర్థిక సహాయం అందించి సహృదయన్ని చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా,మొగుళ్ళపల్లి మండలం,రంగాపురం గ్రామానికి చెందిన చిలువేరు ప్రవళిక అనే విద్యార్థిని గుజరాత్ లోని (NFSU) (నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ) సైబర్ సెక్యూరిటీ, బీటెక్,ఎంటెక్,కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లో సీటు సాధించింది.

అందుకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు రోజు వారి కూలీలు కావడంతో కట్టలేని పరిస్థితి..దీంతో దాతల సహకారం కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ని ఆశ్రయించగా తన కుటుంబ సభ్యుల సహకారం మరియు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రవళిక చదువు కోసం 10 పది వేల రూపాయలు అందించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ చదువుతోనే అన్ని రంగాలలో రాణించవచ్చని,చదువే పేదరికాన్ని దూరం చేస్తుందని తస్లీమా అన్నారు..సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు,తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement