Monday, April 29, 2024

Political Game – రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని అడ్డుకుంటుంది – కాంగ్రెస్ పై మండి పడ్డ కేటీఆర్

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు.

తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పోరేటర్లతో అయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.., కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు రూ. 1.25 కోట్లు అవసరం అవుతాయి కానీ బడ్జెట్ లో రూ. 53 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు అనడం విడ్డూరమన్నారు. ప్రతి కరెంట్ మీటర్ కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుంది.. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్ లో చెప్పలేదు అని ప్రశ్నించారు. ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు.

. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.. జీహెచ్ఎంసీ పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. ప్రజాపాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండ, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని పేర్కొన్నారు.

ఈనెల 13 న నల్లగొండలో జరిగే సభకు అందరూ హాజరు కావాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను కోరామని తెలిపారు. మరోవైపు.. ఈనెల 19న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నిర్ణయాలను.. తమ సభ్యులు ఎండగడతారని పేర్కొన్నారు. ఒక్కరో ఇద్దరో పార్టీ మారితే వచ్చే నష్టం ఏమి లేదు.. అది వారి కర్మ అని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టిందే మేం…

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని.. దాన్ని భూతద్దంలో పెట్టీ చూపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు మూర్ఖులని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాంగ్రెస్‌కు ఏం తెలియదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని తెలిపారు. చూడాలనీ అనుకుంటే కాంగ్రెస్ నేతలు వెళ్లి చూడొచ్చని అన్నారు. సూర్యుడు మీదా ఉమ్ము వేస్తే అది మన మొహం మీదనే పడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డెప్త్ కాంగ్రెస్ తెలుసుకుంటే మంచిదన్నారు.

ప్రాజెక్టు కట్టిందే తామేనని చూడాల్సింది వాళ్లేనని అన్నారు. ప్రాజెక్టులో చిన్న, చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలని.. అంతే కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇంక తాము అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారన్నారు. ప్రతి చిన్న విషయాన్ని బట్ట కాల్చి మీదా వేస్తున్నారన్నారని మండిపడ్డారు. తప్పు ఏదైనా జరిగితే బయట పెట్టాలనియ కోరారు. ఐఏఎస్‌లపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తీ అని ఎద్దేవా చేశారు. ఆయన క్రిమినల్ ఆలోచనలు ఉంటే ఎవరి మీదానైనా చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement