Friday, May 17, 2024

NDA | సాయుధ దళాల్లో 198 ఖాళీలు.. ప‌ది, ఇంట‌ర్ అర్హ‌త‌తోనే ప్ర‌వేశాలు

నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది.. ఫిబ్రవరి 16తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్‌కు ట్రైనింగ్ ఇస్తారు. ఈ సంస్థ తాజా రిక్రూట్‌మెంట్‌లో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులు కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు..

లోయర్ డివిజన్ క్లర్క్-16 పోస్టులు, స్టెనోగ్రాఫర్ GDE-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి. కంపోజిటర్ కమ్ ప్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్ (OG)-3, కార్పెంటర్-2, ఫైర్‌మెన్-2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైయినింగ్-151 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయో పరిమితి: NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ అర్హతగా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్ లభిస్తుంది.

- Advertisement -

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తుదారులు NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతభత్యాలు: NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 నుంచి రూ. 63,200 మధ్య లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement