Tuesday, October 26, 2021

తెలుగు అకాడమి కేసు: పోలీసు కస్టడీకి నిందితులు

తెలుగు అకాడమి కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని మూడు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను కస్టడీలోకి తీసుకోని విచారించనున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో శనివారం నుంచి 4 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణం: పయ్యావుల

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News