Wednesday, May 8, 2024

శ్రద్ధతోని పనిచేసే వ్యక్తికే పట్టం కట్టాలి….. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, ఫిబ్రవరి 15(ప్రభ న్యూస్) – శ్రద్ధతో పని చేసే వ్యక్తికే పట్టం కట్టాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిచ్కుంద పట్టణ కేంద్రంలో 12 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 200 కోట్లతో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంకా అదనంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంతు షిండే కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి నిధులు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.

జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అన్ని రంగాల్లో ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిచ్కుంద బాన్సువాడ రోడ్డు కోసం పాదయాత్ర చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జుక్కల్ నియోజకవర్గం 200 కోట్లు తో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. శాసనసభాపతి సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జుక్కల్ నియోజవర్గం ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పటేల్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజా గౌడ్, బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, బిచ్కుంద జడ్పిటిసి భారతి రాజు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement