Sunday, May 5, 2024

ప్రతిపక్షాలపై ‘ఈడీ’ని ప్రయోగించడం కాదు.. శ్రీలంక విండ్‌ పవర్‌ ఆరోపణలపై ప్రధాని, అదానీ స్పందించాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాని మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షనాయకులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ),సీబీఐ, ఐబీ టార్గెట్‌ చేయడం సర్వసాధారణమే కానీ, శ్రీలంక ప్రభుత్వ అధికారులు పవన విద్యుత్‌ కాంట్రాక్టులపై ప్రధాని మోడీని టార్గెట్‌ చేస్తే ప్రధాని,అదానీ ఎందుకు స్పందించలేదు. అని ప్రశ్నిస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో మీడియా కూడా నిశ్శబ్దం వహిస్తోందని విమర్శించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతున్న తరుణంలో కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అడ్డదారిలో పవర్‌ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకుందని అదానీ గ్రూపుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని మన్నార్‌ జిల్లాలో నిర్మించతలబెట్టిన 500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్లాంటును పోటీ లేకుండా అదానీ గ్రూపునకు కట్టబెట్టాలని భారత పీఎం నరేంద్రమోడీ, శ్రీలంక అధ్యక్షులు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంఎంసీ ఫెర్డినాండో బయటపెట్టారు. ఆనాటి నుంచి లంకేయులు అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. లంక ప్రజలు సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపై పెద్ద ఉద్యమమే లేవదీస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement