Sunday, May 5, 2024

TS : ఫిర్ ఏక్ బార్ మోదీ కా సర్కార్… ఈటల రాజేందర్…

ఎల్బీనగర్, మార్చి 13 (ప్రభ న్యూస్) : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మన భారత దేశ సర్వతోముఖాభి వృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరు గర్వంగా మేము భారతీయులము అనే విధంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డిజిటల్ విప్లవాన్ని అతి సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులోకి తెచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది, రౌతు మంచివాడు అయితే గుర్రం బాగా స్వారీ చేస్తుంది అన్న చందంగా ఈ రోజు భారత దేశ ఔనత్యాన్ని, దశ దిశలు వ్యాపించిన ఘనత కూడా మన నరేంద్రమోడీ కి దక్కిందని తెలియ జేశారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే మన తెలుగు నానుడికి ప్రతీకగా అయోధ్యలో బాల రాముని మందిరం ఎటువంటి మాత విద్వేషాలకు తావు ఇవ్వకుండా పూర్తి చేసి భారతీయుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేవిధంగా మన అందరికి అందుబాటులోకి తెచ్చిన ఘనత కూడా మోడీదే అన్నారు. ఫిర్ ఏక్ బార్ మోడీ కా సర్కార్ అనే నినాదంతో ప్రతొక్క కార్యకర్త కార్యోన్ముఖులై నిబద్దతతో రాబోయే లోక్ సభ ఎన్నికలలో బూత్ స్థాయి నుండి కష్టపడి మల్కాజ్​గిరి లోక్ సభ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో విజయం సాధించి మన నాయకులూ నరేంద్ర మోడీ కి కానుకగా ఇవ్వాలని కోరారు.

తద్వారా దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరిని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో వున్నా కాంగ్రెస్ సర్కారు అమలుకు అసాధ్యమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని కానీ దేశంలో ప్రజలకు ఎటువంటి తాయిలాలు ప్రకటించకుండా అత్యంత పారదర్శకమైన అవినీతి రహిత పాలనను అందిస్తూ మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిగా అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవిధంగా ప్రజలు తమ ఓటు హక్కుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కొత్త రవీంద్ర గౌడ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి , పార్లమెంట్ ఇంచార్జి గోలి మధుసూదన్ రెడ్డి , కార్పొరేటర్లు కొప్పుల నరసింహ రెడ్డి , రంగ నరసింహ గుప్తా, చింతల సురేందర్ యాదవ్ ,బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయికోటి పవన్ కుమార్, కళ్లెం జీవన్ రెడ్డి , వెంకటేశ్వర్ రెడ్డి, పాదూరి కరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement