Monday, May 13, 2024

వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

కొత్తగూడ, (ప్రభ న్యూస్) : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజున కొత్తగూడ మండలంలోని ఎమ్.పి.యు.పి.ఎస్. బూరుగుగుంపు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈక లక్ష్మి నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ… అంగ వైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం దివ్యాంగులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. అవయవలోపాన్ని మరచి, స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. అంగవైకల్యం ఎవరికీ శాపం కారాదని, సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులను చిన్నచూపు చూడరాదన్నారు. అనంతరం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడలు నిర్వహించి బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్.పి.యు.పి.ఎస్.కొత్తగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.రాజశేఖర్, ఉపాధ్యాయులు వి.పాపయ్య, డి.శ్రీనివాస్, స్పెషల్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ బిట్ల శ్రీనివాస్, కె.జమున, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement