Sunday, December 8, 2024

BRS: రేపు కేసీఆర్‌ అధ్య‌క్ష‌త‌న బిఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ సమావేశం….

ఎన్నిక‌ల త‌ర్వాత బాత్ రూంలో జారిప‌డి స‌ర్జ‌రీ జ‌రిగి విశ్రాంతి తీసుకుంటున్న గులాబీ బాస్ కేసీఆర్‌ తిరిగి రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనేందుకు సిద్ద‌మవుతున్నారు. దీనిలో భాగంగా రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నారు.

ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి కేసీఆర్ అధ్యక్షత వ‌హించ‌నున్నారు. శుక్ర‌వారం మధ్యాహ్నం నిర్వహించే సమావేశానికి రాజ్యసభ, లోక్ సభ సభ్యులు హాజరు కావాలని ఇప్ప‌టికే సమాచారమిచ్చారు. ఈ కీల‌క స‌మావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం హాజరు కానున్నారు.

ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలను కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా పలువురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌పై అధినేత క్లారిటీ ఇవ్వలేదు. కేవలం బోయినపల్లి వినోద్ కుమార్, రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు మాత్రమే ఎంపీ టికెట్‌పై హామీ ఇచ్చారు. మిగతా సిట్టింగ్లకు పార్లమెంటరీ సన్నాక సమావేశాల్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమావేశంలో క్లారిటీ ఇస్తారని కొంతమంది ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement