Tuesday, May 7, 2024

TS : పిల్ల‌ల‌ను చెడగొడుతున్న‌ది పేరేంట్సే….సందీప్ శాండిల్య‌….

పిల్లలకు డబ్బులు ఇచ్చి పేరెంట్స్ చెడగొడుతున్నారని తెలిపారు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. చదువుల్లోనే పిల్లలను మానసికంగా ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారని అన్నారు. పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరిది బాధ్యత పేరెంట్స్‌దా? టీచర్స్ దా? పిల్లలదా? పోలీసులదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లో నేడు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.

- Advertisement -

డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జ‌రిగిన ఈ స‌ద‌స్సులో ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్ర వెంకటేశం, యాం టీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సందీప్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారి సినిమాలు చూడకూడదని సూచించారు. అలాంటి సినిమాలాను ఎంకరేజ్ చేయొద్దని అన్నారు. 21 ఏళ్ళలోపు వాళ్ళకు మద్యం అమ్మకూడదు కాని ఎవరు పట్టించుకుంటున్నారని మండిపడ్డారు. పిల్లల మానసిక స్తితిని పేరెంట్స్, టీచర్స్ గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని తెలిపారు. పిలల్లను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలను నిరుత్సాహ పరచకండి, ఉత్సాహ పరచాలని తెలిపారు.

ఇంట్లో పరిస్థితుల కారణంగా టీనేజ్ వయస్సులోనే డ్రగ్స్ వైపు ఎందుకు బానిసలుగా మారుతున్నారని, ఇటీవల కాలంలో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరు గుర్తించడం లేదని, జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement