Sunday, April 28, 2024

TS: పాలమూరు ఊహించని స్థాయిలో అన్నిరంగాల్లో అభివృద్ధి… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 18 (ప్రభ న్యూస్): పాలమూరి ఊహించని స్థాయిలో అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ వాసులకు వినాయక చవితి సందర్భంగా సీఎం కేసీఆర్ శుభవార్త అందించారన్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో జీవో వస్తుందని ఇవాళ ప్రగతిభవన్ లో వినాయక పూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని ఆయన అన్నారు. పండుగ పూట మనకు ఇది పెద్ద శుభవార్త అని అన్నారు.

మహబూబ్ నగర్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహబూబ్ నగర్ ఊహించని స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు జేఎన్టీయూ మహబూబ్ నగర్ క్యాంపస్ ఏర్పాటుతో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య స్థానిక యువతకు లభిస్తుందన్నారు. శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రెండు పెద్ద కాలువలు జిల్లా కేంద్రం గుండా వెళతాయన్నారు. నదిలాంటి కాలువలు ఒకటి ధర్మాపూర్ వద్ద, మరొకటి పాలకొండ వద్ద హైవేల మీదుగా వెళ్తాయన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి జిల్లా కరువును పారదోలుతోందని తెలిపారు.


ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఐలాండ్, శిల్పారామం, కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, మొదలైనవి మహబూబ్ నగర్ కు మనిహారంగా మారాయన్నారు. మన్యంకొండ రోప్ వే పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. మల్టీ ప్లెక్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఫుడ్ పార్క్, ఐటీ కారిడార్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు. శాంతిభద్రతలు ఇక్కడ ఎంతో బాగున్నాయని, అందుకే పరిశ్రమలు, సాప్ట్ వేర్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ రామ్ నగర్ వార్డు అధ్యక్షుడు శరత్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement