Tuesday, May 14, 2024

panicked: అదుపు త‌ప్పిన లారీలు … రోడ్ల‌పై బీభ‌త్సం…

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఓ కారును తప్పించబోయి అదుపుతప్పిన సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం తాండూర్ నుండి సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఫ్లై ఓవర్ సమీపంలోని పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్న కారును అతివేగంగా వెళుతున్న లారీ కారును ఢీకొట్టబోయింది.

చేరుకున్న లారీ డ్రైవర్ కారు తప్పించే ప్రయత్నంలో భాగంగా లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి ఆపై బిల్డింగ్ ముందుకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే లారీ బిల్డింగ్ పైకి దూసుకొచ్చిన సమయంలో పలు ద్విచక్ర వాహనాలు కూడా ఘటన నుండి తప్పించుకున్నాయి. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.

కూక‌ట్ ప‌ల్లిలోనూ….

- Advertisement -

మరోవైపు కూకట్ పల్లి జాతీరహదారిపై బుధవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో అదుపు తప్పిన లారీ.. పక్కనే ఉన్న వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పక్కనే వస్తున్న కారును లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో కారు వెనక భాగం నుజ్జు నుజ్జు అయింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement