Friday, June 9, 2023

అక్ర‌మ ద‌త్త‌త కేసులో క‌రాటే క‌ళ్యాణికి నోటీసులు.. క‌లెక్ట‌ర్ ఎదుట హాజ‌రుకావాల‌ని ఆదేశాలు

పిల్ల‌ల‌ను అక్ర‌మంగా ద‌త్త‌త తీసుకున్నార‌న్న అంశంపై చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ అధికారులు న‌టి కరాటే క‌ళ్యాణి ఇంట్లో నిన్న‌టి నుంచి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కాగా, ఓ చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న‌ట్టు వెల్ల‌డి కావ‌డంతో నోటీసులు అందించారు. ఈ విష‌యంలో హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ ఎదుట హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవ్వాల (సోమ‌వారం) మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు టైమ్ ఇచ్చినా రాక‌పోవ‌డంతో త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈ అక్ర‌మ ద‌త్త‌త విష‌యంలో కేసు క‌నుక అయిన‌ట్ట‌యితే క‌ళ్యాణికి జైలు శిక్ష‌తో పాటు జ‌రిమానా విధించే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement