Sunday, April 28, 2024

టెన్షన్​ వద్దు, పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.. హైదరాబాద్ డీఈవో రోహిణి

ప్రభన్యూస్, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని హైదరాబాద్ డీఈవో రోహిణి సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలపై ఆదివారం ప్రభన్యూస్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మే 23 అంటే సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరిగే రోజుల్లో ప్రతి రోజు ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగుతాయని తెలిపారు.

హైదరాబాద్​ జిల్లా వ్యాప్తంగా మొత్తం 406 పరీక్షా కేంద్రాల్లో 78వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు డీఈవో రోహిణి చెప్పారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకూడదన్నారు. పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవడం వల్ల స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా ఉంటారని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు ఇతర పరికరాలను (గ్యాడ్జెట్స్) పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని వెల్లడించారు. అయితే విద్యార్థులకు మాత్రం 9.30 గంటల తర్వాత 5 నిమిషాల వెసులుబాటులో 9 .35 నిమిషాల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని అన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లలో సమస్యలుంటే ఎగ్జామినర్ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement