Thursday, April 25, 2024

సౌథాఫ్రికా టూర్‌కు టీమిండియా రెడీ.. టెస్ట్‌, టీ20 జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ..

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్‌కు సంబంధించిన‌ భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెక్షన్‌ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. అదే స‌మ‌యంలో ఇంగ్లండ్‌ సిరిస్‌కు సంబంధించి రీషెడ్యూల్‌ చేసిన టెస్ట్‌ కోసం సైతం బీసీసీఐ జట్టును ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా మహమ్మారి కారణంగా టెస్ట్‌ మ్యాచ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ జూలై 1-5 మధ్య భారత్‌– ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగునున్నది. అయితే, మ్యాచ్‌కు ఛతేశ్వర్‌ పూజారాను తిరిగి జట్టులోకి తీసుకున్న బీసీసీఐ, అజింక్యా రహానేకు మాత్రం చోటు దక్కలేదు.

భార‌త్ టీ20 జట్టు..

కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్‌ కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌) దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్.

టీ-20 సిరిస్‌ షెడ్యూల్..

భారత్‌తో దక్షిణాఫ్రికా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూన్‌ 9న చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరిస్‌ ప్రారంభంకానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12న తేదీన రెండో టీ20, మహారాష్ట్రలోని విదర్భలో 14న మూడో టీ20 మ్యాచ్‌ జరుగనున్నది. చివరి రెండు టీ20లకు సౌరాష్ట్ర, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు టీ20 జూన్ 17, 19తేదీల్లో జరుగనున్నాయి.

- Advertisement -

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్), కేఎస్ భరత్ (వికెట్), ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement