Sunday, May 12, 2024

పది రూపాయల కాయిన్స్‌ని ఎవరూ తీసుకోవ‌ట్లే.. బ్యాంక‌ర్లేమో ప‌ర్లేదు అంటున్నారు!

శంకర్‌పల్లి, (ప్రభన్యూస్‌): శంకర్‌పల్లి మున్సిపల్‌ మరియు మండల పరిధిలో ఎవ్వరూ ఎక్కడా పది రూపాయల కాయిన్స్‌ తీసుకోవడం లేదు. ఈ ప్రాంతంలో అనధికారి కంగా వాటిపై నిషేధం విధించినారా అన్నంత పని చేస్తున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయంలో పూర్తిస్థాయిలో బాధ్యతాాంహిత్యం వలన ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి వారి వ్యాపారాలను చూసుకోవడం మినహాయిస్తే ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను వారు ఎప్పడో మర్చిపోయారు. ఆర్థిక వ్యవహారాలను సరి చేయాల్సిన బాధ్యత ఎవరిదో మరి అర్థం కావడం లేదు. అవగాహన లేని ప్రజలు ఈ కాయిన్స్‌ని తీసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితు లలో స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వద్దకు వచ్చే వ్యాపారులు అందరికీ కూడా బ్యాంకుల నుండి విత్‌ డ్రా చేసుకునే మొత్తంలో ఎంతో కొంత భాగము పది రూపాయల కాయిన్స్‌ని ఇచ్చినట్లయితే అలా ప్రజల్లోకి వెళ్లిపోయి పది రూపాయల కాయిన్స్‌ చల్లామణీ ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది. సామాజిక కోణంలో బ్యాంకులు ముందుకు వస్తే వ్యాపారులు కూడా అందుకు సహకరిస్తారు. కానీ ఇంత పెద్ద బాధ్యతలు ఎవరూ తీసుకుంటారు. ఈ పరిస్థితులలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిద్ర మత్తు నుండి బయటకు రావాలి వల్ల బాధ్యతలను వారు నిర్వర్తించాలి తద్వారా ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు చేరువ కావడానికి మరింత అవకాశం ఉంటుంది. స్థానికంగా చిరువ్యా పారులు అందరూ కూడా పది రూపాయల కాయి న్స్‌తో చలామణి జరిగి నట్లయితే వాళ్ల విశ్వాసం పెరిగి వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను పరిశీలన చేసే అధికారులు పట్టన ట్లు ఉండే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. తప్ప ఇందులో మార్పు రాదు. ఈ పరిస్థితులలో మార్పు తీసుకువచ్చి అందరూ పది రూపాయల కాయిన్స్‌ తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement