Monday, April 29, 2024

పాఠశాలలో ఎగరని జాతీయ జెండా – ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని గ్రామస్తుల డిమాండ్

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.వాడ వాడల, ప్రభుత్వ,ప్రైవేటు విద్యా ప్రభుత్వ కార్యాలయాలవద్ద త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.స్వతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా జరుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ,మండలోoలోని ఓ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ రోజున జాతీయ జెండా ఎగరలేదు.

నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అందుకు భిన్నంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాకపోవడమే కాకుండా జాతీయ జెండాను అవమానపరిచారు.


వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజపూర్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేయకుండా పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారు. పాఠశాలకు హెడ్ మాష్టర్, . ఉపాధ్యాయులు పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం హాజరు కాలేదు జెండాను ఎగరవేయడం కూడా మర్చిపోయి

స్వాతంత్ర దినోత్సవం నాడే జాతీయ జెండాను అవమానపరిచారని స్థానికలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో జెండా ఎగరవేయక పోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాల కు వచ్చి వెనుదిరిగారు .పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు లేకున్నా గాని ఎంఈఓ పరిధిలో ఉన్న ఎంఆర్సి నుండి సిబ్బందితోనైనా జెండా ఎగరవేయాల్సి ఉంటుందని అది కూడా చేయకుండా పూర్తిగా జెండా పండుగను నిర్లక్ష్యం చేశారని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పాఠశాలలను తనిఖీ చేయవలసిన ఎంఈఓ సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎంఈఓ తనిఖీలు లేకనే పాఠశాలలో జాతీయ జెండా ఎగరలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి సంబంధిత మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాల్సిందిగా,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement