Thursday, May 2, 2024

మాజీ ఎమ్మెల్యే శోభకు నో బెయిల్‌.. 14 రోజుల రిమాండ్

కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు మరో ఇద్దరికి కరీంనగర్ న్యాయమూర్తి బెయిల్ నిరాకరించడంతో పాటు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేనీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మరికొంత మందిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.

ఇందులో భాగంగా బుధవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బిజెపి నాయకులు ఉప్పర్పల్లి శ్రీను, రాపర్తి ప్రసాద్ లను పోలీసులు కరీంనగర్ కోర్టు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి బెయిల్ నిరాకరించి 14రోజుల రిమాండ్ విధించడంతో ముగ్గురిని కరీంనగర్ జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement