Monday, April 29, 2024

NZB: యువతే దేశ భవిష్యత్తు… జెండా ఊపి ర్యాలీ ప్రారం భించిన జిల్లా జడ్జి ,సిపి

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 13(ప్రభ న్యూస్):యువతే దేశ భవిష్యత్తు అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని, చట్టాలను గౌరవిం చి వాటిని పాటించాలని సూచించారు.

35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని మేఘన ఇన్సిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషి యల్ సర్జరీ దినోత్సవం పురస్క రించుకొని జిల్లా ప్రభుత్వ హాస్ప టల్ నుండి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానీకి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల,నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ముఖ్య అతిథి లుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ హస్పటల్ నుండి ప్రారంభమై ఆర్.టి.సి బస్టాండ్ తిలక్ గార్డెన్ రైల్వే స్టేషన్ ,ఎన్.టి.ఆర్ చౌరస్తా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement